Arjun Tendulkar: ఒక్క ఛాన్స్ అంటున్న సచిన్ టెండుల్కర్ కొడుకు.. వాటర్ బాయ్ డ్యూటీ ఇచ్చిన లక్నో..

Arjun Tendulkar: ఒక్క ఛాన్స్ అంటున్న సచిన్ టెండుల్కర్ కొడుకు.. వాటర్ బాయ్ డ్యూటీ ఇచ్చిన లక్నో..

Arjun Tendulkar: గత ఐదేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌లో కొనసాగిన అర్జున్ టెండుల్కర్ గత ఏడాది జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ట్రేడ్ అయ్యారు. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, సచిన్ కొడుకుకు ఇంకా తుది జట్టులో అవకాశం మాత్రం దక్కలేదు. ఏప్రిల్ 5వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ 'వాటర్ బాయ్'గా సేవలు అందిస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బౌండరీ లైన్ దగ్గర అభిమానులు తన పేరును పిలుస్తుంటే, అతడు హుందాగా తన బాధ్యతను నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది.

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ రికార్డులు: 
అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో మొత్తం 3 వికెట్లు తీసుకున్నాడు. ఇవన్నీ ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడే వచ్చాయి. 2023 సీజన్‌లో ఆయన ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం: 
గత నెలలో అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ను వివాహం చేసుకున్నారు. గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్ రవి ఘై మనవరాలైన సానియా, టెండూల్కర్ కుటుంబానికి, ముఖ్యంగా అర్జున్ సోదరి సారాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ వివాహ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, మైదానంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అర్జున్, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషంగా ముందడుగు వేశారు. త్వరలోనే ఆయన లక్నో జెర్సీలో డెబ్యూ చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.