హైదరాబాద్ యూసుఫ్‌గూడ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. సీసీ ఫుటేజ్లో బయటపడిన అసలు నిజం !

హైదరాబాద్ యూసుఫ్‌గూడ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. సీసీ ఫుటేజ్లో బయటపడిన అసలు నిజం !

హైదరాబాద్: హైదరాబాద్ యూసుఫ్‌గూడ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. వృద్ధుడు తనకు తాను బస్ కింద పడినట్టు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు చూశాక స్పష్టమైంది. వెళుతున్న బస్సును ఆపిన వృద్ధుడు.. బస్ ఆగి ముందుకు కదలగానే వెనుక టైర్ కింద తలపెట్టాడు. వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చనిపోయిన వృద్ధుడిని మహబూబ్ నగర్కు చెందిన బీనప్పగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మధురా నగర్ పోలీసులు వృద్ధుడి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వృద్ధుడు ఇలా చేశాడో లేక చనిపోవాలని నిర్ణయించుకుని బస్సు కింద తలపెట్టాడో తెలియాల్సి ఉంది. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తే.. వృద్ధుడు చనిపోవాలని నిర్ణయించుకునే బస్సు టైరు కింద తలపెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుండటం గమనార్హం.