RR vs MI Toss Delay: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా బర్సపరా స్టేడియంలో జరగాల్సిన రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. గౌహతిలో సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ వేయడం ఆలస్యమైంది. బజలి, బక్సా, చిరాంగ్, దర్రాంగ్, కమ్రూప్, కమ్రూప్ మెట్రో, మోరిగావ్, నల్బరి, తముల్‌పూర్, ఉదల్‌గురి ప్రాంతాల్లో రాబోయే మూడు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ (IMD) 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.
ఇక సాయంత్రం 4:40 నుండి రాత్రి 7:35 వరకు వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గౌహతిలో వర్షం తగ్గిన తర్వాత తదుపరి టాస్ గురించి అప్‌డేట్ ఇస్తామని ఐపీఎల్ నిర్వహకులు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా స్టేడియం నుంచి తాజా పరిస్థితులను వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గత రాత్రి కోల్‌కతాలో మ్యాచ్ వర్షార్పణం కావడం జరిగిందని.. ఈ మ్యాచ్ కూడా రద్దవుతుందేమోనని అభిమానులు కంగారు పడుతున్నారని పేర్కొన్నాడు..
ఒకవేళ రాత్రి 9 గంటల తర్వాత వర్షం పూర్తిగా తగ్గిపోతే, రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఆడేందుకు మైదానాన్ని సిద్ధం చేసి ఓవర్ల సంఖ్యను తగ్గించి (Shortened Match) అయినా ఈ పోరు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్షం కారణంగా పిచ్‌ను ఎక్కువ సమయం కవర్లతో కప్పి ఉంచడం వల్ల.. మ్యాచ్ మొదలైతే బౌలర్లకు ఇది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీని వలన ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇక రెండో ఇన్సింగ్స్ లో డ్యూ ఎఫ్టెక్ తో బౌలింగ్ చేసే జట్టు ఈజీగా పరుగులు సమర్పించుకునే అవకాశం ఉంది.
🚨 Update 🚨
— IndianPremierLeague (@IPL) April 7, 2026
Toss is delayed in Guwahati.
Next update to follow once the rain stops.#TATAIPL | #KhelBindaas | #RRvMI pic.twitter.com/cheEGdXSEz
