శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ 

శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఎస్ఐ కనకయ్య. స్టేషన్ బెయిల్ కోసం రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా కనకయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం ( ఏప్రిల్ 7 ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. పోలీస్ స్టేషన్  లోనే కనకయ్యను పట్టుకున్నారు అధికారులు.స్టేషన్ లో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఏసీబీ అధికారులను గమనించిన కనకయ్య అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు అతనిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.