
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని గండికోటలో పురాతన ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. కొద్దిరోజులుగా అభివృద్ధి పనుల కోసం అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో ఫిరంగి గుండ్లను గుర్తించారు. మొత్తం 6 ఫిరంగి గుండ్లను అధికారులు బయటకు తీశారు. ఇవి అత్యంత పురాతనమైనవని అధికారులు చెప్పారు.