ఆషాఢం స్వీట్స్ :బోనాలు సెలబ్రేషన్లు.. ఎంజాయి మెంట్ .. ఇవి తిన్నారంటే అలసట ఇట్టే పోతుంది..!

ఆషాఢం స్వీట్స్  :బోనాలు సెలబ్రేషన్లు.. ఎంజాయి మెంట్ .. ఇవి  తిన్నారంటే అలసట ఇట్టే పోతుంది..!

 ఆషాఢమాసం అంటే తెలంగాణలో బోనాలు.. అమ్మవారి పూజలు .. సంబరాలు జరుపుకొని ఇంటికి వెళ్లిన తరువాత ముందుగా ప్రసాదం తిని ఆ తరువాత నోటిని  తీపి చేసుకోకపోతే  ఎలా. అసలే ఆడి పాడి అలసిపోయి ఉంటాం కదా..  అందుకే నోరూరించే స్వీట్లు మీకోసం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ స్వీట్లతో వేడుకల్ని మరింత మధురంగా  ఎంజాయి చేయాలంటే రుచికరమైన స్వీట్లను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.  . !

పాకం గవ్వలు తయారీకి కావాల్సినవి

  • మైదా లేదా గోధుమపిండి- ఒక కప్పు
  •  బొంబాయి రవ్వ - ఒక టేబుల్ స్పూన్
  •  బెల్లం తరుము- అర కప్పు 
  • నెయ్యి– ఒక టేబుల్ స్పూన్
  •  నూనె- వేగించడానికి సరిపడా

పాకం గవ్వలు తయారీ విధానం

 ఒక పెద్ద గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి వేసి ముద్దలా చేయాలి. ఆ ముద్ద గట్టిగా కాకుండా. మృదువుగా ఉండేలా చూడాలి. ఆ మిశ్రమాన్ని అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం వచ్చే దాక మరగనివ్వాలి. వేగించిన గవ్వలను ఆ పాకంలో వేసి కలిపితే పాకం గవ్వలు రడీ.. తింటే అదిరిపోయే రుచి.. బలం కూడా.. ఎగిరిన అలసట అంతా ఇట్టే పోతుంది..

బాదుషా తయారీకి కావాల్సినవి

  • మైదా ఒక కేజీ
  • వెన్న – పావుకేజీ
  • బేకింగ్ పౌడర్ - రెండు టీ స్పూన్లు 
  • నూనె - సరిపడా 
  • చక్కెర - ఒక కేజీ 
  • నీళ్లు– తగినన్ని 
  • యాలకుల పొడి - ఒక టీ స్పూన్

బాదూషా తయారీ విధానం

మరుగుతున్న నీళ్లలో చక్కెర వేసి కొంచెం ముదురుపాకం వచ్చేంత వరకు స్టవ్​ పై  ఉంచాలి. పాకం దగ్గరపడ్డాక యాలకుల పొడి కలిపి దింపాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వెన్న వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దగా కలపాలి. దీనిపై కాటన్ క్లాత్​ కప్పి ఐదు నిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని చేత్తో బాదుషా లా అదిమి కాగేనూనెలో వేసి డీప్​ ఫ్రై  చేయాలి. తరువాత వాటిని చక్కెర పాకంలో వేసి 15 నిమిషాలు ఉంచి తీసేయాలి.  ఇవి  తిన్నారంటే ఆహా ఏమి రుచిలే అంటూ మళ్లీ గంతులేస్తారు.  పిల్లలు.. పెద్దలు ఇష్టంగా తింటారు.