రాజస్థాన్ సీఎంపై పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి

రాజస్థాన్ సీఎంపై పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ పై పరువు నష్టం దావా నమోదైంది.  కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. సీఎం  గెహ్లాట్‌ పై ఈ కేసు వేయగా 2023 ఆగస్టు 7న హాజరు కావాలంటూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సమన్లు ​​జారీ చేసింది.  సంజీవని క్రెడిట్ సొసైటీ కుంభకోణంలో సీఎం  గెహ్లాట్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగిందంటూ షెకావత్.. గెహ్లాట్ పై  రూ. 900 కోట్ల పరువునష్టం దావా వేశారు. 

రాజస్థాన్ ప్రభుత్వం ఈ కేసును విచారించినప్పుడు తన పేరు ఎక్కడా కనిపించలేదని షెకావత్ పేర్కొన్నారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కామ్ కు సంబంధించి జోధ్ పూర్ ఎంపీ కూడా అయిన షెకావత్ ఇన్వెస్టర్లను కోట్ల రూపాయల మేర ఛీట్ చేశారని గెహ్లాట్ ఇటీవల ఆరోపించారు. 

స్కాామ్ ఎంటీ ?

సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరిట గల ఈ సంస్థ 2019 లో రాజస్తాన్ లో ఏర్పాటయింది. సుమారు 1.46 లక్షలమంది ఇన్వెస్టర్లు గోల్ మాల్ చేసి దాదాపు రూ. 953 కోట్లకు టోపీ పెట్టారు. ప్రజలు చెల్లించే చిన్న మొత్తాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి ఈ సంస్థ నాడు నమ్మబలకడంతో అనేకమంది తమ కష్టార్జితాన్ని ఇందులో పెట్టుబడులుగా పెట్టారు.  ఆ నాడు ఈ స్కామ్ లో షెకావత్ ను కూడా నిందితునిగా పోలీసులు కేసు పెట్టారు. అయితే ఆయన అరెస్ట్ కాకుండా రాజస్తాన్ హైకోర్టు గత ఏప్రిల్ లో ఉత్తర్వులిచ్చింది.