పోలీసు స్టేషన్ ముందు ఏఎస్ఐ భార్య ధర్నా

పోలీసు స్టేషన్ ముందు ఏఎస్ఐ భార్య ధర్నా
అర్ధరాత్రి ఇద్దరు ఎస్.ఐలు.. ఐదుగురు కానిస్టేబుళ్లు వచ్చి పట్టుకెళ్లారు తెల్లవారుజామున అరెస్ట్ అని మెసేజ్ పెట్టడం అన్యాయం అంటూ నిరసన రైటర్ గా ఆయన ఏమి రాసినా.. అధికారులు కళ్లు మూసుకుని గుడ్డిగా సంతకాలు చేశారా..? ఇంటిమేషన్ లేకుండా అరెస్టు చేసి టార్చర్ పెడుతున్నారు -శ్రీనివాసరావు భార్య నాగమణి ఆరోపణ పై వాళ్లు తప్పులు చేసి తన భర్తను ఇరికిస్తున్నారంటూ సిబ్బందితో వాగ్వాదం యాదాద్రి: యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ముందు డీసీపీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భార్య నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసి.. టార్చర్ పెడుతున్నారని.. తమకు చూపించడంలేదంటూ నిరసనకు చేపట్టింది. అర్ధరాత్రి ఇద్దరు ఎస్.ఐలు.. ఐదుగురు కానిస్టేబుళ్లతో వచ్చి తీసుకెళ్లి.. అరెస్టు చేశామని తెల్లవారుజామున 6 గంటలకు మెసేజ్ పెట్టారని.. ఇంటిమేషన్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని స్టేషన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్ లో తీసుకువచ్చినట్లు తెలియడంతో వచ్చామని.. తనకు తన కుటుంబానికి న్యాయం చేేసే వరకు ఇక్కడే బైఠాయిస్తానంటూ  ఆందోళన వ్యక్తం చేసింది. 2017లో ఓ భూమికి సంబంధించిన కేసులో అప్పటి ఎస్ఐ రమేష్ సంతకాన్ని అదే సమయంలో రైటర్ గా ఉన్న శ్రీనివాసరావు ఫోర్జరీ చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  2017లో యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో మురళీమోహన్ అనే రియల్టర్ కు సంబంధించిన భూ వివాదం కేసులో తనను స్థానిక సీఐ జానకీరెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని గతంలో ఏసీపీ రైటర్ గా పని చేసిన శ్రీనివాస్ రావు (ప్రస్తుతం డీసీపీ కార్యాలయంలో పని చేస్తున్నాడు) ఆరోపణ. అప్పటి కేసులో రూ. 3 లక్షలు ఇప్పించక పోవడంతోనే తనను యాదగిరిగుట్ట సీఐ  జానకిరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టు చేసిన రైటర్ శ్రీనివాస్ రావు. ప్రస్తుతం శ్రీనివాస్ రావు పోలీస్ కస్టడీలో‌ ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా అప్పటి ఎస్ఐ రమేష్ (ప్రస్తుతం ఆలేరు పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు) సంతకాలను ఫోర్జరీ చేయడంతో అరెస్టు చేశామన్నారు. తన భర్తను అర్థరాత్రి ఇంటి నుండి తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్లు తెల్లవారుజామున 6 గంటలకు తమకు మెసేజ్ పెట్టారని రైటర్ శ్రీనివాస్ భార్య నాగమణి ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం.. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆరోపించింది. ఏదైనా తప్పు చేస్తే.. ఇంటిమేషన్ ఇచ్చి అరెస్టు చేయాలని కదా అని ప్రశ్నిస్తోంది. ఆయన ఏం చేయగలరు.. రైటర్ గా అధికారులు చెప్పిందే చేస్తారు తప్ప అదనంగా  ఏం చేయలేరు కదా.. ఆయన ఏదైనా చేస్తుంటే మూడేండ్లుగా ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. అధికారులు కళ్లు మూసుకుని సంతకాలు చేశారా.. ఫైల్ రెడీ చేయడమే రైటర్ డ్యూటీ కదా అని నాగమణి వాదన. అప్పటి ఎస్.ఐలు రమేష్, రాజు, సీఐ జానకిరెడ్డి ముగ్గురు కలసి తప్పులు చేసి ఆ నెపం రైటర్ అయిన తన భర్తపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాగమణి ఆరోపిస్తోంది. మా వారు ఎలాంటి తప్పు చేయరని.. లక్షలు జేబులో వేసుకుని అమాయకుడని నా భర్తను ఇరికిస్తున్నారని అంటోంది. కనీసం నా భర్త వాదన వినకుండా ఎలా అరెస్టు చేస్తారని నాగమని ప్రశ్నిస్తోంది. నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తే.. నాకు.. నా పిల్లలకు దిక్కెవరని.. తనకు న్యాయం చేయాలని నాగమణి డిమాండ్ చేసింది.