T20 World Cup 2024: వరల్డ్ కప్ జట్టు ఇదేనా..? ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ పాకిస్థాన్ స్క్వాడ్ ప్రకటన

T20 World Cup 2024: వరల్డ్ కప్ జట్టు ఇదేనా..? ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ పాకిస్థాన్ స్క్వాడ్ ప్రకటన

పొట్టి ప్రపంచ కప్ సమరానికి అన్ని దేశాలు ఒక్కొక్కటిగా జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా దేశాలు ఆయా జట్లను ప్రకటించగా.. దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ లకు 15 మంది సభ్యుల గల బలమైన జట్టును పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసింది. ఈ జట్టుకు బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు.

పాకిస్థాన్ వరల్డ్ కప్ స్క్వాడ్ దాదాపుగా ఇదే కానుందని సమాచారం. సీనియర్లు ఇమాద్ వసీం, మహమ్మద్ అమీర్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్ పాక్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరికిదే చివరి అవకాశం. పాక్ జట్టు బ్యాటింగ్‌లో అంత బలంగా లేనప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం దుర్భేధ్యంగా కనిపిస్తోంది. షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్, మహమ్మద్ అమీర్, నసీం షా రూపంలో నలుగురు అత్యుత్తమ పేసర్లు జట్టులో ఉన్నారు. వీరికి సహాయపడటానికి షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.

మొత్తంగా చూసుకుంటే పాక్.. బౌలింగ్ పరంగా బలంగా ఉంది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఐర్లాండ్(మే 10- 14), ఇంగ్లాండ్(మే 10- 14 మే 22- 30) జట్లతో జరిగే టీ20 సిరీస్ లకు ఇదే జట్టును కొనసాగించనున్నారు. టీ20 వరల్డ్ కప్ కు దాదాపుగా ఇదే జట్టును కొనసాగించనున్నారు. త్వరలోనే పాకిస్థాన్ వరల్డ్ కప్ స్క్వాడ్ ను ప్రకటించే అవకాశం ఉంది. 

ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ లకు పాకిస్థాన్ జట్టు:

బాబర్ అజామ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ ఎ. సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్.