సోషల్ మీడియాను ఊపేస్తున్న కరోనా పేషెంట్స్‌ ఫ్లాష్ మాబ్ వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తున్న కరోనా పేషెంట్స్‌ ఫ్లాష్ మాబ్ వీడియో

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు కరోనా అసింప్టోమేటిక్ (లక్షణాలు లేని రోగులు) పేషెంట్స్ ఫ్లాష్ మాబ్ చేయడం గమనార్హం. కర్నాటకలోని బల్లారిలో ఆదివారం ఈ ఫ్లాష్ మాబ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి ఉత్సుతకను, ఉత్సాహాన్ని నెటిజన్స్‌ మెచ్చుకుంటున్నారు. బళ్లారిలోని కరోనా కేర్‌‌ సెంటర్‌‌లో కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు కలసి చేసిన ఈ డ్యాన్స్‌లో వాళ్లందరూ ఫేస్ మాస్క్‌లు కట్టుకున్నారు.

ఈ వీడియోను నాగార్జున్ ద్వారాకానాథ్ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు. పెద్ద సంఖ్యలో డాక్టర్‌‌లు, పోలీసులు, మామూలు ప్రజలు ఈ పాటలో డాన్స్ చేశారని వీడియోకు క్యాప్షన్ జత చేశారు.

1999లో ఉపేంద్ర నటించిన ఓ సినిమాలో రవీనా టాండన్‌తో కలసి మస్తు మస్తు సంగతుంది అనే పాటకు ఉప్పి వేసిన స్టెప్స్‌ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే పాటకు కరోనా అసింప్టోమేటిక్ పేషెంట్స్‌ కాళ్లు కదిపి హుషారుగా డాన్స్ చేసి అలరించారు.