ఆకస్మిక వరదలు థాయిలాండ్ ను ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన భారీ వరదల ధాటికి దక్షిణ థాయిలాండ్ అతలాకుతలం అయ్యింది. ఈ వరదల కారణంగా శుక్రవారం నాటికి 145 మంది మరణించినట్లు తెలిపారు అధికారులు. ఈ స్థాయిలో వరదలు గత కొన్నేళ్లలో ఎప్పుడు రాలేదని అంటున్నారు. ఈ వరదల్లో వేలాది మంది చిక్కుకుపోగా భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
8 ప్రావిన్స్ ప్రాంతాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు అధికారులు. ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్థంబాలు నేలకు ఒరిగాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వీధులన్నీ బురదతో నిండిపోయి గృహోపకారణాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. వరద బాధితులు వదిలేసి వెళ్లిన కార్లు ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా ఒకదాని మీద ఒకటి పడిపోవడం చూస్తే.. వరద ఉదృతి ఎంత తీవ్రంగా ఉందో ఊహించొచ్చు.
ఈ క్రమంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు విపత్తు నిర్వహణ అధికారులు. ఇదిలా ఉండగా.. శ్రీలంకను సైతం భారీ వరదలు ముంచెత్తాయి.. దిత్యా తుపాను కారణంగా కురు స్తున్న భారీ వర్గాలతో కొండచరియలు విరిగి పడ్డాయి. వరద దాటికి 600కి పైగా ఇండ్లు, స్కూళ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపో యాయి. అనేక సహదారులు, పాదాలు అల్ల దిగ్బంధమయ్యాయి. ఈ ఆకస్మిక వరదలతో ఇప్పటికే 56 మంది చనిపోగా.. మరో 21 మంది గల్లంతయినట్లు ప్రభుత్వ విపత్తు
ర్వహణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
