హైదరాబాద్ సిటీలోని ఆర్సీపురంలో తీవ్ర విషాదం నెలకొంది. లిఫ్టులో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆర్సీపురం పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందని వెంకటేశ్వర్లు భార్య, కొడుకుతో కలిసి రామచంద్రారెడ్డినగర్ లోని ఓ అపార్టుమెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. శనివారం (మే9) ఉదయం వెంకటేశ్వర్లు నాలుగేళ్ల కొడుకు గిరిధర్ ఆడుకుంటూ వెళ్లి లిఫ్టు ఎక్కే సమయంలో ఇరుక్కుపోయాడు. గమనించిన వాచ్ మెన్ కుటుంబ సభ్యులు, అపార్టుమెంట్ వాసులు అప్రమత్తమై బాలుడిని లిఫ్టునుంచి బయటికి తీశారు. అయితే తీవ్రగాయాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
