తమిళనాడు రాష్ట్రంలో మేం గెలిచింది ఒక్క సీటు మాత్రమే అయినా.. మా పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ఏ పార్టీకి ఒటేయడు అని స్పష్టం చేశారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్ర.తమిళనాడులో టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ విషయంపై ఆయన స్పందించారు.
టీవీకే పార్టీ అయినా.. డీఎంకే అయినా.. అన్నాడీఎంకే అయినా.. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని.. ఆ సమయంలో బీజేపీ నుంచి గెలిచిన మా ఒక్క ఎమ్మెల్యే ఏ పార్టీకి ఓటేయడని.. తటస్థంగా ఉంటాడని స్పష్టం చేశారు నైనార్ నాగేంద్ర.
తమిళనాడు రాష్ట్రం ఊటీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బోజ రాజన్ 976 ఓట్ల మెజార్టీతో.. టీవీకే అభ్యర్థిపై విజయం సాధించారు. అన్నాడీఎంకే పొత్తులో భాగంగా బీజేపీ 33 నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. ఒక్క సీటు మాత్రమే గెలిచింది.
గెలిచిన ఒక్క బీజేపీ ఎమ్మెల్యే సైతం తటస్థంగా ఉంటాడని.. ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది తమిళనాడు బీజేపీ శాఖ.
