స్టాలిన్ ఇంత కుట్ర చేశారా..? కామ్రేడ్లు బయటపెట్టిన సీక్రెట్.. అందుకే కాంగ్రెస్ విజయ్కు మద్దతిచ్చిందా..!

స్టాలిన్ ఇంత కుట్ర చేశారా..? కామ్రేడ్లు బయటపెట్టిన సీక్రెట్.. అందుకే కాంగ్రెస్ విజయ్కు మద్దతిచ్చిందా..!

తమిళనాడు రాజకీయాల్లో మరో ఊహించని కుట్ర కోణం బయటకు వచ్చింది. ఇప్పుడే ఇదే హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ టీవీకే పార్టీకి.. అందరి కంటే ముందే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎందుకు ఇచ్చింది అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఈ విషయాన్ని తమిళనాడు సీపీఎం ప్రధాన కార్యదర్శి బాబీ స్వయంగా వెల్లడించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. ఈ క్రమంలోనే డీఎంకే కూటమిలోని పార్టీలు అన్నీ.. స్టాలిన్ ను సంప్రదించాయి. రాజకీయ వ్యూహంపై చర్చించినట్లు బాబీ వెల్లడించారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ దగ్గర మద్దతు లేదు.. మిగతా పార్టీలు అన్నీ కూటమిలోనే ఉన్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం కష్టం అంటూ స్టాలిన్ స్పష్టం చేశారంట.

అదే సమయంలో.. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే కంటే.. అన్నాడీఎంకే పార్టీకి డీఎంకే మద్దతు ఇవ్వటం మంచిదనే సలహా ఇచ్చారంట స్టాలిన్. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేద్దాం.. డీఎంకే కూటమి బయట నుంచి మద్దతు ఇస్తుంది.. విజయ్ ను ఎదుర్కోవటానికి ఇదే మంచి వ్యూహం అని స్టాలిన్ వివరించినట్లు సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి బాబీ స్పష్టం చేశారు. 

స్టాలిన్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయని.. బీజేపీ కూటమిలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఎలా ఇస్తాం అని ప్రశ్నించినట్లు వివరించారాయన. అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వటం అంటే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినట్లే అని.. అప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లు అవుతుందని.. ఇది సాధ్యం కాదని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారాయన. 

స్టాలిన్ ఆలోచన, స్టాలిన్ స్ట్రాటజీ తెలిసిన తర్వాతనే.. కాంగ్రెస్ పార్టీ.. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిందని.. అదే బాటలో కమ్యూనిస్ట్ పార్టీలు విజయ్ కు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారాయన. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినట్లు అందరూ అనుకుంటున్నారని.. స్టాలిన్ ద్రోహం చేయటానికి సిద్ధం అయ్యాడని.. దాన్ని పసిగట్టి ముందుగానే బయటకు వచ్చినట్లు వెల్లడించారు తమిళనాడు సీపీఎం ప్రధాన కార్యదర్శి బాబీ. అన్నాడీఎంకే పార్టీకి మేం ఎప్పటికీ మద్దతు ఇవ్వం.. ఇవ్వబోం అని.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకేతో ఎలా కలుస్తాం అని ప్రశ్నించారాయన.