సిక్సర్ల వర్షం.. ఫోర్ల వరద.. ఇది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెకండ్ ఇన్నింగ్స్ లో మోగిన మోత. ఐపీఎల్ 2026 లో భాగంగా 51 మ్యాచ్ లో.. ఢిల్లీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 143 రన్స్ టార్గెట్ ను ఉఫ్ న ఊదేసింది కోల్ కతా. ఫిన్ అలెన్ హ్యాట్రిక్ సిక్సులతో ఊచకోతకు ఢిల్లీ బౌలర్లు అతలాకుతలం అయ్యారు. ఫోర్లు సిక్సులతో సెంచరీతో చెలరేగాడు ఫిన్ అలెన్. 47 బంతులలో 10 సిక్సులు, 5 ఫోర్లతో సెంచరీ (100) చేసి విజయాన్ని అందించాడు.
అలెన్ హ్యాట్రిక్ సిక్సుల మోత:
పిచ్చ ఫామ్ లోకి వచ్చిన అలెన్.. 13వ ఓవర్ 2లో హ్యాట్రిక్ సిక్సులతో మోత మోగించాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో 2,3,4 బాల్స్ కు వరుసగా సిక్సులు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇంత తక్కువ టార్గెట్ లో కూడా 100 సిక్సులు కొట్టాడంటే అలెన్ జోరు.. స్టేడియంలో హోరు ఎలా ఉందో ఊహించవచ్చు.
అలెన్ కు తోడు కామెరాన్ గ్రీన్ 2 సిక్సులతో 27 బంతులలో 33 రన్స్ చేసి విజయంలో పాలు పంచుకున్నాడు. అంతకు ముందు కెప్టెన్ రహానే స్టార్ట్ బౌలింగ్ లో 13 రన్స్ కే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆంగ్ క్రిష్ రఘువంశీ 1 రన్ కే అక్షర్ పటేల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు.
ఢిల్లీ ఫ్లాప్ షో:
అంతకు ముందు టాస్ ఓడి బ్యాంటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. అట్లర్ ఫ్లాప్ షోతో స్వల్ప స్కోర్ కే పరిమయ్యారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. ఓపెనర్లు రాణించినప్పటికీ.. ఆ తర్వాత బ్యాటర్లు కుప్పకూలడంతో.. 11 ఓవర్ నుంచి స్కో్ర్ బోర్డు పూర్తిగా ఢీలా పడిపోయింది.
ఢిల్లీ మళ్లీ పాత పాటే పాడింది. స్టార్ బ్యాటర్స్ ఉన్నా.. టాపార్డర్ ఎప్పట్లాగే పెవిలియన్ కు క్యూ కట్టారు. టపా టపా వికెట్లు సమర్పించుకుంటూ చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా ముందు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు.
పతుమ్ నిస్సంక అర్ధ సెంచరీ, అశుతోష్ శర్మ 39 పరుగుతో ఢీల్లీ ఫస్ట్ 10 పది ఓవర్లలోపు మంచి స్కోరే చేసింది. కేఎల్ రాహుల్, నిస్సంక కలిసి మెరుపు వేగంతో 49 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 23 పరుగుల వద్ద అవుటవ్వగా, నిస్సంక తన అర్ధ సెంచరీని (29 బంతుల్లో 50) పూర్తి చేశాడు. ఈ శ్రీలంక బ్యాటర్ ఎప్పుడైతే అవుటయ్యాడో అక్కడి నుంచి ఢిల్లీ పట్టు కోల్పోయింది.
అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (28 బంతుల్లో 39) ఢిల్లీకి పోరాడేందుకు కొంత అవకాశం కల్పించింది. కానీ.. ఫిల్ అలెన్ జోరుకు.. ఆ స్కోరు ఏ మాత్రమూ సరిపోలేదు. కేవలం 14.2 ఓవర్లలో అంటే.. 34 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ టార్గెట్ ను ఫినిష్ చేసింది. దీంతో రన్ రేట్ కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. అలెన్ మెరుపు ఇన్నింగ్స్ తో విన్ అయిన కేకేఆర్.. మేమింకా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నామనే సంకేతం పంపింది. గత నాలుగు మ్యాచ్ లలో వరుసగా గెలుస్తూ.. కేకేఆర్ పుంజుకుంటుండటం ఆలోచించాల్సిన విషయమే.
