తమిళనాడుకు కాబోయే సీఎం విజయ్ కాదు.. రజినీకాంత్ అనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతుంది. అవును.. మీరు చదువుతున్నది నిజమే.. తమిళనాడు సీఎంగా రజనీకాంత్ ను చేయాలనే ప్రతిపాదన వచ్చిందంట. దీనిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు జోరుగా చర్చిస్తున్నట్లు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం.
విజయ్ ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు. ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అని అన్నాడీఎంకే సంకేతాలు ఇచ్చేసింది.. డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఒక వేళ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న డీఎంకే నుంచి రజినీకాంత్ ను సీఎం చేయాలనే ఆలోచనలో ఉందంట డీఎంకే పార్టీ. దీనికి అన్నాడీఎంకే పార్టీ కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టాలిన్ సీఎం కాకుండా.. డీఎంకే తరపున రజినీకాంత్ ను సీఎం చేస్తూ.. అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామిని స్పీకర్ చేయాలనే ప్రతిపాదనలతో కొత్త ఈక్వేషన్స్ నడుస్తున్నాయంట.
డీఎంకే సీనియర్ నేత వేలు రజినీకాంత్ ఇంటికి వెళ్లి.. చాలా సమయం ఉన్నారు అక్కడ. రజినీకాంత్ ఇంట్లో వేలు 2 గంటలకు పైగా ఉన్నారు. ఆ తర్వాత రజినీకాంత్ ఇంటి నుంచి నేరుగా స్టాలిన్ దగ్గరకు వెళ్లారు. ఈ పరిణామాలు కూడా ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తున్నాయి.
నిన్నటికి నిన్న అన్నాడీఎంకే నేత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని.. ఎవరూ ఊహించలేని నిర్ణయాలు జరగొచ్చు అని.. దానికి సంకేతం ఇదే అంటున్నారు.
డీఎంకే పార్టీ ఓడిన తర్వాత.. ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత స్టాలిన్ ఇంటికి స్వయంగా వచ్చిన పరామర్శించారు రజనీకాంత్. డీఎంకే పార్టీతో.. స్టాలిన్ తో ఉన్న అనుబంధం అదీ.
రజనీకాంత్ ను సీఎం చేస్తే.. టీవీకే పార్టీ నుంచి వచ్చే ఒత్తిడులు, గొడవలను ఈజీగా ఎదుర్కోవచ్చు అని.. సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుందనే ఉద్దేశంలో స్టాలిన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
