రైనా బంధువుల హత్య కేసు.. ముగ్గురు నిందితుల పట్టివేత

రైనా బంధువుల హత్య కేసు.. ముగ్గురు నిందితుల పట్టివేత

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా బంధువులపై గత నెలలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను అరెస్ట్ చేశామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు ఇంటర్ స్టేట్ గ్యాంగ్ క్రిమినల్స్‌‌ను పట్టుకున్నామని, మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీజీపీ దిన్‌‌‌కర్ గుప్తా చెప్పారు. నిందితుల నుంచి ఒక గోల్డ్ రింగ్, గోల్డ్ చైన్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సావన్, ముహబ్బత్, షారుఖ్ ఖాన్‌‌గా గుర్తించారు. గత నెల 19న జరిగిన దాడిలో రైనా అంకుల్ అశోక్ కుమార్ చనిపోయారు. ఆయన కుమారుడు కౌషల్ కుమార్ గాయాలకు చికిత్స పొందుతూ గత నెల 31న మృతి చెందారు. ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతున్న కౌషల్ భార్య ఆశా రాణి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిలో గాయపడ్డ మరో ఇద్దరు రైనా కుటుంబీకులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పంజాబ్ సీఎం అమరిందర్ స్పందించారు. ఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకోవాల్సిందిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌‌ఐటీ)ను ఆదేశించారు. రంగంలోకి దిగిన సిట్ అధికారులు నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.