వాకింగ్ చేస్తున్న సీఎంను చంపడానికి ప్రయత్నం

వాకింగ్ చేస్తున్న సీఎంను చంపడానికి ప్రయత్నం

అగర్తలా: త్రిపుర సీఎం బిప్లబ్​ కుమార్‌‌‌‌ దేబ్‌‌ను కారుతో ఢీకొట్టించి హత్య చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురుని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అగర్తలాలోని నివాసం దగ్గర గురువారం ఈవెనింగ్ వాక్‌‌ చేస్తున్న సీఎం మీదకు సెక్యూరిటీ సిబ్బందిని దాటి కారు వేగంగా దూసుకొచ్చింది. అప్రమత్తమైన సీఎం పక్కకు జంప్ చేయడంతో  ప్రమాదం తప్పింది. అదే రోజు రాత్రి కెర్చోవ్‌‌ముహాని ఏరియాలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, కారును సీజ్ చేశారు. హత్యాయత్నం కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను చీఫ్ జ్యుడీషియల్‌‌ మేజిస్ట్రేట్‌‌ పీపీ పాల్‌‌ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. ఆగస్టు 19 వరకు నిందితులకు జ్యుడీషియల్‌‌ కస్టడీని కోర్టు విధించింది. రెండు రోజుల పోలీసు కస్టడీకి నిందితులను అప్పగించాలని కోర్టును కోరినా ఇవ్వలేదని అసిస్టెంట్‌‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌ బిద్యుత్‌‌ సూత్రధార్‌‌‌‌ తెలిపారు. జైలుకు వెళ్లి పోలీసులు వారిని ఇంటరాగేట్‌‌ చేస్తారని, హత్యాయత్నానికి కారణాలను తెలుసుకుంటారని చెప్పారు.