మోకిలాలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం

మోకిలాలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం

హైదరాబాద్‌ వెలుగు : సిటీ శివారులోని  మోకిలాలో హెచ్‌ఎండీఏ లే ఔట్లలో  ప్లాట్ల అమ్మకానికి  శుక్రవారం ప్రీ బిడ్ మీటింగ్‌ నిర్వహించగా దాదాపు 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వెస్ట్‌ సిటీ హబ్‌ మోకిలాలో 165.37 ఎకరాల్లో 1,321 హెచ్‌ఎండీఏ లే అవుట్  చేసింది. ఇందులో గజం రూ.25వేల చొప్పున 50 ప్లాట్లను ఆన్ లైన్ వేలంలో అమ్ముతుంది. 

కొనుగోలుదారులు గజానికి రూ.500 చొప్పున కోట్‌ చేసి ఏ1 బిడ్డర్‌‌గా నిలిచి ప్లాట్లను దక్కించుకోవచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. కోకాపేట్ నియో పోలీస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట పార్క్, సీబీఐటీ, ఓషియన్ పార్క్ లకు సమీపంలో ఉన్నాయని పేర్కొంది. 

ప్రీబిడ్​లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్(ఈవో) బి కిషన్ రావు వెంచర్ ప్రాధాన్యతను, హెచ్ఎండీఏ మౌలిక సదుపాయాల అంశాలను వివరించారు.