మైనర్​పై మేనత్త లైంగిక దాడి

మైనర్​పై మేనత్త లైంగిక దాడి

బంజారాహిల్స్, వెలుగు: పద్నాలుగేండ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడికి పాల్పడి డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను ఆన్ లైన్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. చార్మినార్ ప్రాంతంలో ఉండే భార్యాభర్తలు కుమారుడి(14)తో కలిసి ఇటీవల జూబ్లీహిల్స్​కు వచ్చి ఉంటున్నారు. ఇంట్లో సామగ్రిని సర్దుకుంటుండగా 200 గ్రాముల బంగారం కనిపించలేదు. దీంతో తల్లి బంగారం గురించి కుమారుడిని నిలదీసింది.

బంగారాన్ని మేనత్త   నజియా భానుకు ఇచ్చినట్టు బాలుడు చెప్పాడు. ఎందుకు ఇచ్చావని తల్లి ప్రశ్నించడంతో.. నజియా, ఆమె మాజీ భర్త ఇర్ఫాన్​తో కలిసి స్కూల్ నుంచి తనను కారులో ఎక్కించుకుని చార్మినార్​లోని ఓ లాడ్జిలో లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పాడు. ఇలా చాలాసార్లు చేశారని.. దాన్ని వీడియో తీసి రూ. 6 లక్షలు ఇవ్వకపోతే ఆన్ లైన్ లో పెడతానని నజియా, ఇర్ఫాన్ బెదిరించారని ఆ బాలుడు తల్లితో చెప్పాడు. వారికి డబ్బులు ఇచ్చేందుకు బంగారం చోరీ చేసినట్లు బాలుడు తెలిపాడు.  దీంతో బాలుడి తల్లి బంజారాహిల్స్ పోలీసులకు గురువారం కంప్లయింట్ చేసింది. పోలీసులు నజియా భానుపై పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.