ఇండియా చేజారిన టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌

ఇండియా చేజారిన టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌

దుబాయ్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌(డబ్ల్యూటీసీ)లో ఇండియా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ కోల్పోయింది. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన పాయింట్‌‌‌‌ పర్సంటేజ్‌‌‌‌ విధానమే ఇండియాకు నష్టం కలిగించింది. ఐసీసీ గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇండియాను వెనక్కునెట్టి ఆస్ట్రేలియా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరింది. పాయింట్ల పరంగా ఇండియా( 360 పాయింట్లు), ఆస్ట్రేలియా(296) కంటే ముందు ఉంది. కానీ 82.2 శాతం పాయింట్స్‌‌‌‌ పర్సంటేజ్‌‌‌‌తో ఆసీస్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టాపర్‌‌‌‌గా నిలవగా..75 పర్సంటేజ్‌‌‌‌తో ఉన్న ఇండియా సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు పడిపోయింది.

ఇంగ్లండ్‌‌‌‌(60.8), న్యూజిలాండ్‌‌‌‌(50.0)తో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా కారణంగా డబ్ల్యూటీసీలో పలు సిరీస్‌‌‌‌లు రద్దు కావడంతో ఐసీసీ పాయింట్స్‌‌‌‌ పర్సంటేజ్‌‌‌‌ విధానాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిప్రకారం లీగ్‌‌‌‌ ముగిసేసరికి టాప్‌‌‌‌–2లో నిలిచిన రెండు జట్లు వచ్చే ఏడాది లార్డ్స్‌‌‌‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి. కాగా, 2022లో సౌతాఫ్రికా వేదికగా జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్‌‌కప్‌‌ను 2023కి పోస్ట్‌‌పోన్‌‌ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.