బిగ్ ఫైట్ : న్యూజిలాండ్ తో మ్యాచ్..ఆస్ట్రేలియా బ్యాటింగ్

బిగ్ ఫైట్ : న్యూజిలాండ్ తో మ్యాచ్..ఆస్ట్రేలియా బ్యాటింగ్

వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఆస్ట్రేలియా. కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ టీమ్ లో ఎలాంటి మార్పులు చేయట్లేదని తెలిపాడు ఆసీస్ కెప్టెన్ ఫించ్. హెన్రీ స్థానంలో సోధీ.. కోలిన్ మున్రో ప్లేస్ లో హెన్రీ నికోల్స్‌ను  టీమ్ లోకి సెలక్ట్ కివీస్ కెప్టెన్ విలియమ్సన్ తెలిపాడు. ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ఫస్ట్ టీమ్ గా ఆసీస్ నిలిచింది.

5 విజయాలు, 11 పాయింట్లతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సెమీస్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే విలియమ్సన్ సేనకు మరో గెలుపు తప్పనిసరి. చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ఆసీస్‌ను మట్టికరిపించే నాకౌట్‌లో అడుగుపెట్టాలని కివీస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..