మద్యం మత్తులో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

మద్యం మత్తులో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

గోషామహల్, వెలుగు: మద్యం మత్తులో స్కూల్​ పిల్లలను తీసుకెళ్తున్న ఓ ఆటోడ్రైవర్‌‌‌‌ను గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్​చేశారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ సమీపంలో గురువారం ఉదయం పాఠశాల బస్సులు, స్కూల్ ఆటోలను ట్రాఫిక్ ఎస్సై జగదీశ్, హోంగార్డులు కిరణ్ కుమార్, సురేశ్​తనిఖీ చేశారు.

అబిడ్స్‌‌‌‌ లోని ఓ పాఠశాలకు ఆరుగురు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఆపారు. డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం ట్రాఫిక్​ సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలో దింపారు. తదుపరి చర్యల కోసం డ్రైవర్‌‌‌‌ను గోషామహల్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో అప్పగించారు. షేక్ ఇస్మాయిల్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.