ప్రముఖ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ కొడుకు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్‌పై పి. చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ డాలీ క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించారు. గంటా రవితేజ కెమెరా స్విచాన్ చేయగా, నల్లమలుపు బుజ్జి మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.
ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ ఇదని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ చంద్రశేఖరన్ డీవోపీగా, బిబిన్ అశోక్ సంగీత దర్శకుడిగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. జూన్ 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
