‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉందని చెప్పింది సమంత. ఆమె లీడ్‌గా నందినీరెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో సమంత మాట్లాడుతూ ‘మూడు సంవత్సరాల తర్వాత చేసిన సినిమా ఇది. రాజ్ గారు కమర్షియల్ ఇంపాక్ట్ ఉండేలా ఈరోల్ రాశారు.
హీరోయిన్‌గా చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అయితే ఏదో ఒక స్టేజ్‌లో రిస్క్ అవసరం. లేకపోతే.. ఒకచోటే ఆగిపోతాం. కెరీర్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశా. కొందరైతే సమంత పని అయిపోయిందని రాశారు. హీరోయిన్‌గా ఇక కష్టమని కూడా అన్నారు. నేను ఆ సమయంలో ఏమీ బాధపడలేదు. దాన్ని చాలెంజ్‌గా తీసుకుని వచ్చాను. నాతో పాటు టీమ్ మొత్తం ఈ సినిమాను చాలెంజింగ్‌గా తీసుకుని వర్క్ చేశాం. కెరీర్ అనేది మన చేతిలో ఉంటుంది.
కానీ రిలేషన్ అనేది ఇద్దరి వ్యక్తుల చేతిలో ఉంటుంది. ఏదైనా చక్కగా ముందుకు వెళ్లాలంటే అమ్మాయి తనపై తాను నమ్మకంతో ఉండాలి. ఒకే వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడకూడదని ఇప్పటి అమ్మాయిలకు చెబుతాను. సినిమాను ఇంత భారీ సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్’ అని చెప్పింది. ఈ చిత్రంలోని సమంత యాక్టింగ్ అందర్నీ సర్‌ప్రైజ్ చేసిందని నందినీ రెడ్డి అన్నారు. నటి శ్రీముఖి, నిర్మాతలు రాజ్ నిడిమోరు, హిమాంక్ ఈ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు.
