నేను రెడీ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. స్టయిలిష్ లుక్‎లో హీరో హవీష్

నేను రెడీ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. స్టయిలిష్ లుక్‎లో హీరో హవీష్

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు. గురువారం హవీష్ బర్త్‌‌డే సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌తో తనకు విషెస్ తెలియజేసింది టీమ్. ఇందులో  హవీష్ స్టైలిష్, మాస్ లుక్‌‌లో కనిపిస్తూ  ఆకట్టుకున్నాడు. పాత గ్యారేజ్ నేపథ్యంలో బెంచ్‌‌పై కూర్చొని కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాపై  ఆసక్తిని పెంచుతోంది. 

పాత్రకు తగ్గట్టుగా హవీష్ మేకోవర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కావ్య థాపర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో   బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌‌లో కనిపించనుంది.  బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్, గోపరాజు రమణ, హరితేజ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికాగా,  త్వరలోనే విడుదల తేదీ  ప్రకటించనున్నారు.