ఇండియన్ నేవీలో 275 పోస్టులు.. ఫీజు లేదు.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్‌గా జాబ్ అఫర్..

 ఇండియన్ నేవీలో 275 పోస్టులు.. ఫీజు లేదు.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్‌గా జాబ్ అఫర్..

ఇండియన్ నేవీ జూన్ 2027 (ఏటీ 27) కోర్సుకు సంబంధించి 12 విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్​సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 27.

మొత్తం ఖాళీలు: 275. 

విభాగాల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జీఎస్ (ఎక్స్)/ హైడ్రో కేడర్) 90, పైలట్ 25, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ 18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) 15, లాజిస్టిక్స్ 10, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ (ఎన్ఏఐసీ) 14, ఎడ్యుకేషన్ 13, ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – జీఎస్) 24, ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – జీఎస్) 40, సబ్​మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ 8, నావల్ కనస్ట్రక్టర్ 18. 

ఎలిజిబిలిటీ 
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జీఎస్ (ఎక్స్) హైడ్రో): ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. పైలట్ / నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ / ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ): ఏదైనా విభాగంలో 60 శాతం  మార్కులతో బీఈ/ బి.టెక్ ఉండాలి. వీటితోపాటు 10, 12వ తరగతుల్లో 60 శాతం మార్కులు ఉండాలి. అలాగే 10 లేదా 12వ తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

లాజిస్టిక్స్: ఫస్ట్ క్లాస్ మార్కులతో బీఈ/ బి.టెక్ లేదా ఎంబీఏ  లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ/ బి.కామ్/ బీఎస్సీ (ఐటీ)తోపాటు ఫైనాన్స్/ లాజిస్టిక్స్/ సప్లై చైన్ మేనేజ్‌మెంట్/ మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

నావల్ ఆర్మ​మెంట్ ఇన్‌స్పెక్టరేట్ క్యాడర్ (ఎన్ఏఐసీ): మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, కెమికల్,  మెటలర్జీ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్ లేదా ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్​లో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులకు 10, 12వ తరగతుల్లో 60 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరి.

ఎడ్యుకేషన్ విభాగం: మ్యాథ్స్/ ఫిజిక్స్/ మెటియరాలజీ తదితర సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఎంఏ (కనీసం 55 శాతం మార్కులతో హిస్టరీ) లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ/ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. 10, 12వ తరగతుల్లో 60 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు ఉండాలి.

ఇంజినీరింగ్ బ్రాంచ్ (జీఎస్)/ సబ్‌మెరైన్ టెక్ ఇంజినీరింగ్: మెరైన్, మెకానికల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, కంట్రోల్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ తదితర విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్ పూర్తి చేసి ఉండాలి.

ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జీఎస్)/ సబ్‌మెరైన్ టెక్ ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, పవర్ ఇంజినీరింగ్, ఇనుస్ట్రుమెంటేషన్ తదితర విభాగాల్లో  కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉండాలి.

నావల్ కన్‌స్ట్రక్టర్: మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెరైన్, షిప్ టెక్నాలజీ, నావల్ ఆర్కిటెక్చర్, మెటలర్జీ, షిప్ బిల్డింగ్/డిజైన్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2002, జులై 2 నుంచి 2008, జనవరి 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 25.

లాస్ట్ డేట్: జులై 27.

సెలక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.joinindiannavy.gov.inను సందర్శించండి.