మంత్రి పదవి పోయినందుకు తనకు బాధ లేదని.. ఇకపై ఎమ్మెల్యేగా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు మాజీ మంత్రి కొండా సురేఖ. మంగళవారం ( సెప్టెంబర్ 29 ) వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవచేసే అవకాశం ఉండేదని.. ఎమ్మెల్యే గా వరంగల్ తూర్పు నియోజకవర్గం పై దృష్టి సారించి అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందని అన్నారు కొండా సురేఖ.
ఇక పై నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. వచ్చే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మొన్న ఎంజీఎం దగ్గర బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని.. వాళ్లు వాళ్లే తోసేసుకుని పోలీసులు కొట్టారని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని ఎద్దేవా చేశారు.
కొత్త కలెక్టరేట్ దగ్గర బీజేపీ నేతలు నిరసన తెలిపి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. వరంగల్ బీజేపీ నాయకులకు కొండా సురేఖ సవాల్ విసిరారు. కొండా అనుచరులపై ఈగవాలిన ఊరుకోబోమని హెచ్చరించారు కొండా సురేఖ.
