The Traitors Telugu: బిగ్‌బాస్‌కు పోటీగా 'ద ట్రైటర్స్'.. 20 మంది సెలబ్రిటీలతో తేజా సజ్జా రచ్చ.. ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

The Traitors Telugu: బిగ్‌బాస్‌కు పోటీగా 'ద ట్రైటర్స్'.. 20 మంది సెలబ్రిటీలతో తేజా సజ్జా రచ్చ.. ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ బిగ్‌బాస్ షోకు గట్టి పోటీ ఇచ్చేందుకు మరో మైండ్ గేమింగ్ షో  'ద ట్రైటర్స్' (The Traitors Telugu) తెలుగులోకి అడుగుపెడుతోంది. అంతర్జాతీయంగా సూపర్ హిట్ అయి.. హిందీలో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పాపులర్ ఫార్మాట్.. ఇప్పుడు డిజిటల్ స్పాట్‌లైట్‌ను దక్కించుకోబోతోంది. లేటెస్ట్ గా ఈ షో అనౌన్స్‌మెంట్ కు సంబంధించిన  గ్లింప్స్‌ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఓటీటీ వర్గాల్లో క్యూరియాసిటీ పీక్స్‌కు చేరింది.

ఈ మైండ్ గేమ్ షో ద్వారా 'హనుమాన్' ఫేమ్ యంగ్ హీరో తేజా సజ్జా హోస్ట్‌గా డిజిటల్ రంగానికి పరిచయం అవుతున్నారు. ఆయనలోని చరిష్మా, స్పాంటేనిటీ ఈ షోకి సరికొత్త గ్లామర్ తీసుకురానుంది. రాజస్థాన్ జైసల్మీర్‌లోని రాచరికపు వైభవం ఉట్టిపడే 'సూర్యగఢ్ ప్యాలెస్' బ్యాక్‌డ్రాప్‌లో 20 మంది సెలబ్రిటీ పోటీదారులతో ఈ గేమ్ అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కింది. పేరుకి తగ్గట్లే నమ్మకం, మోసం, సీక్రెట్ అలయన్సెస్ చుట్టూనే ఈ గేమ్‌ప్లే తిరుగుతుంది. ఇందులో దాగున్న 'ట్రైటర్స్' (ద్రోహులు) ఎవరో గుర్తించేందుకు 'ఇన్నోసెంట్స్'  చేసే ప్రాణసంకటమైన పోరాటమే అసలు కథ.

ప్రముఖ నిర్మాణ సంస్థ SOL ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న ఈ షో అక్టోబరు 15 నుంచి ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. 4 వారాల పాటు మొత్తం 10 ఎపిసోడ్లుగా, ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ఒకవైపు బిగ్‌బాస్ లో నాగార్జున సందడి చేస్తూ బుల్లితెరపై దూసుకుపోతున్నారు., మరోవైపు చిరంజీవి కూడా ఓటీటీ టాక్ షో చేయబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తేజ సజ్జా తన మాటల చాతుర్యంతో ఈ నెగిటివిటీ, కుట్రలతో కూడిన రియాలిటీ వరల్డ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్నది ఆసక్తి నెలకొంది. ఈ గేమ్ లో పాల్గొననున్న 20 మంది సెలబ్రిటీలు ఎవరో త్వరలోనే అధికారికంగా వెల్లడికానుంది. మరి  ఓటీటీ స్క్రీన్లపై ఈ మోసపూరిత గేమ్ ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.