Avatar: దుమ్మురేపుతున్న ‘అవతార్ 2 : రెండో వారం కలెక్షన్స్ ఎంతంటే..?

Avatar: దుమ్మురేపుతున్న ‘అవతార్ 2 : రెండో వారం కలెక్షన్స్ ఎంతంటే..?

బాక్సాఫీస్ వద్ద ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ దూకుడు కొనసాగుతోంది. రెండో వారంలోనూ ఈ హాలీవుడ్ మూవీ దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. డిసెంబరు 16న భారత్ లో విడుదలైన ఈ మూవీ మొదటి వారంలో రూ.189.50 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ రూ.300 కోట్లకు చేరువయ్యాయి. ఇక ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ తదుపరి లక్ష్యం  రూ.367 కోట్ల కలెక్షన్స్.

2019 సంవత్సరంలో ‘అవెంజర్ : ఎండ్ గేమ్’ మూవీ రూ.367 కోట్ల కలెక్షన్లను సాధించింది. దాన్ని ఛేదించడం లక్ష్యంగా  ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ ముందుకు సాగనుంది. ఇప్పటివరకు ఈ మూవీ పొందిన కలెక్షన్స్ లో దాదాపు రూ.100 కోట్లు దక్షిణాది మార్కెట్ నుంచే వచ్చాయి.  ఇక గత 15 రోజుల్లో  ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ కలెక్షన్స్ 1 బిలియన్ డాలర్లు దాటింది.