రామమందిర గర్భగృహానికి శంకుస్థాపన

రామమందిర గర్భగృహానికి శంకుస్థాపన

అయోధ్యలో రామమందిర గర్భగృహానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించారన్న ఆయన... నిర్మాణ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వేడుకలో భాగస్వామి కావడం మా అదృష్టమని అన్నారు. ఇకపోతే ఆగష్టు 5,2020లో ప్రారంభించిన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా డిసెంబర్ 2023నాటికి భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. 2023నాటికి గర్భ గ-ృహం, 2024నాటికి ఆలయ నిర్మాణం, 2025 నాటికి ఆలయ సముదాయంలోని పలు నిర్మాణాలు పూర్తయ్యేలా పనులు సాగుతున్నట్టు సమాచారం. 

"రామమందిరం దేశానికే దేవాలయం అవుతుంది. ఈ రోజు కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామమందిరం భారతదేశ ఐక్యతకు చిహ్నం".

-ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

https://twitter.com/ANINewsUP/status/1531861606119813120?s=20&t=6YatKuzE_fOTM6Q4tB7Fng

 

మరిన్ని వార్తల కోసం..

'లాల్ సింగ్ చద్ధా'ను వెంటాడుతున్న ఆమీర్ వ్యాఖ్యలు

ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకం.. పసికందు మృతి