'లాల్ సింగ్ చద్ధా'ను వెంటాడుతున్న ఆమీర్ వ్యాఖ్యలు

'లాల్ సింగ్ చద్ధా'ను వెంటాడుతున్న ఆమీర్ వ్యాఖ్యలు
  • వివాదానికి కారణమైన ఆమీర్ వ్యాఖ్యలు
  • లాల్ సింగ్ చద్ధా సినిమాను నిలిపివేయాలని నెటిజన్ల డిమాండ్
  • బై కాట్ లాల్ సింగ్ చద్ధా యాష్‌ట్యాగ్‌తో ట్రోలింగ్

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన ఆమీర్ ఖాన్ సినిమా అంటే ముందు నుంచే భారీ అంచనాలు ఉంటాయి. ఆ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసే సినీ ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. అయితే చాలా రోజుల తర్వాత అభిమానులను అలరించడానికి ఆమీర్... లాల్ సింగ్ చద్ధా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా... విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు బ్రేక్ చేసింది. దీంతో ఈ మూవీకి భారీ పాపులారిటీ వచ్చేసింది. అంతా బాగుంది అనుకునే లోపే ఈ చిత్రానికి అనుకోని చిక్కు ఎదురైంది.

లాల్ సింగ్ చద్ధా సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా Boycott Laal Singh Chaddha యాష్‌ట్యాగ్‌ని జతచేస్తూ పలు పోస్టులు ట్రోల్ అవుతున్నాయి. అర్థాంతరంగా ఈ మూవీపై ఇంతటి దుమారం రేగడానికి కారణమేమిటంటే.. అప్పట్లో ఆమీర్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి రీజన్ అని తెలుస్తోంది. ఇండియా ఇన్ టాలరెంట్ (భారతదేశంలో జీవించడం కష్టం) అనేలా చేసిన కామెంట్స్ కి నిరసనగా ఇప్పుడీ ఉద్యమం లేవనెత్తుతున్నట్టు తెలుస్తోంది. అమీర్ ఖాన్ సినిమాలు ఎవరూ చూడొద్దు.. కావాలంటే ఆ టికెట్ సొమ్మును ఏదైనా చారిటీకో లేదా అనాథలకో పంచమని పలువురు పిలుపునిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో దేశాన్ని వదిలివెళ్లాలని అమీర్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లాల్ సింగ్ ని ప్రోత్సహించే సమస్యే లేదని పలువురు అంటున్నారు. 2018లో థగ్స్ అఫ్ హిందుస్థాన్ తర్వాత మళ్ళీ అతను తెరమీద కనిపించని ఆమీర్ ని ఇప్పుడు ఈ వివాదం చుట్టుముట్టడంతో ఆయన అభిమానులు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేకైన ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఈ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తో్న్న ఈ మూవీ.. ఫైనల్ గా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. కాగా దీనిపై ఆమీర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇక ముందైనా స్పందిస్తారో, లేదో చూడాలి మరి.

 

మరిన్ని వార్తల కోసం...

ఇండియా విమెన్స్‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌లో శ్రీజకు ప్లేస్‌‌‌‌

హిస్టరీ ప్రశ్నల తీరు మారింది