26 వేళ్లతో జన్మించిన చిన్నారి.. దేవుని అవతారమంటున్న కుటుంబసభ్యులు

26 వేళ్లతో జన్మించిన చిన్నారి.. దేవుని అవతారమంటున్న కుటుంబసభ్యులు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో 26 వేళ్లతో ఆడపిల్ల జన్మించడంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఆమెను దేవతా అవతారంగా అభివర్ణించారు. ఆమె ఒక్కో చేతికి ఏడు వేళ్లు, కాలుకు ఆరు వేళ్లతో జన్మించింది. శిశువును ఆమె కుటుంబ సభ్యులు డోలాగర్ దేవి అవతారంగా భావిస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం దీన్ని జన్యుపరమైన లోపంగా చెబుతున్నారు. 26 వేళ్లు ఉండటం సాధారణమైనప్పటికీ, ఈ పరిస్థితి చాలా అరుదు.

Also Rard: ఓ మహిళ రాజ్యం కోసం పోరాడితే..

పాప తల్లి సర్జూ దేవి 25 ఏళ్ల మహిళ, ఆమె ప్రసవ వేదనకు గురైనప్పుడు 8 నెలల గర్భవతి. శిశువుకు 26 వేళ్లు ఉండటం వల్ల ఎలాంటి హాని లేదు కానీ ఇది జన్యుపరమైన వైపరీత్యమని, చిన్నారి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని డాక్టర్ బిఎస్ సోనీ తెలిపారు. బిడ్డ పుట్టినందుకు కుటుంబం ఉప్పొంగిపోయిందని, చిన్నారిని డాలాగర్ దేవి అవతారంగా భావిస్తున్నట్లు తల్లి సోదరుడు చెప్పారు. "నా సోదరి 26 వేళ్లు ఉన్న పాపకు జన్మనిచ్చింది, శిశువును డోలాగర్ దేవి అవతారంగా భావిస్తున్నాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని ఆయన అన్నారు. కాగా పాప తండ్రి గోపాల్ భట్టాచార్య సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.