
‘భీమ్లా నాయక్’ చిత్రంలో లేడీ కానిస్టేబుల్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మోనిక రెడ్డి. ఇప్పుడు ఆమె లీడ్ రోల్‌లో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. రాకేష్ రెడ్డి యాస దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సుధా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.
భాస్కర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవి ప్రసాద్ భలివాడ క్లాప్ కొట్టారు. అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా మోనిక రెడ్డి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించినా.. ఇది మాత్రం నాకు స్పెషల్.
స్టోరీ మొత్తం నా మీదే నడిచే లేడీ ఓరియెంటెడ్‌లో నటించడం హ్యాపీగా ఉంది’ అని చెప్పింది. దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ ‘ఇదొక పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్. ఒక మహిళ ధైర్య సాహసాలతో రాజ్యం కోసం పోరాడితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమిది’ అన్నాడు. ఈ కార్యక్రమంలో సుమన్, భాను ప్రశాంత్, హారిక తదితరులు పాల్గొన్నారు.