ఖైరతాబాద్ చింతలబస్తీ నాలాలో మొసలి పిల్ల

ఖైరతాబాద్ చింతలబస్తీ నాలాలో మొసలి పిల్ల

హైదరాబాద్ సిటీలో బుధవారం 27వ తేదీ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీలో నాలాలు పొంగిపొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ చింతల బస్తీలోని నాలాలో మొసలి పిల్ల ప్రత్యక్షం అయ్యింది. మొసలి పిల్లను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. 

Also Read :- హైదరాబాద్కు రెడ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

భారీగా పడిన వర్షానికి నాలాలోని మొసలి పిల్ల కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు. బస్తీలో నాలా వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఈ మొసలి పిల్ల కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కొందరు.. మొసలి బయటకు రాకుండా కర్రలతో దాన్ని నాలాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఒడ్డుకు వచ్చిన మొసలి పిల్ల జనాన్ని చూసి అరవటం చేసింది. దీంతో కంగారు పడ్డారు జనం.