హైదరాబాద్కు రెడ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్కు రెడ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్  సిటీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది  వాతావరణ శాఖ. నగరానికి భారీ వర్ష సూచన ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే పలు చోట్ల  బీభత్సమైన వర్షం పడుతోంది.  ఈ క్రమంలో రెడ్  అలర్ట్  జారీ చేసింది. ఈదురుగాలులు,ఉరుములతో కూడిన భారీ వర్షం పడనుందని తెలిపింది.

దాదాపు గంట నుంచి  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, అశోక్ నగర్, మియాపూర్, ఖైరతాబాద్, లక్డికాపూల్, దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, కోఠి, బషీర్ నగర్, సుల్తానా బజార్, బేగంబజార్, అఫ్జల్ గంజ్ పలు ప్రాంతాల్లో  వర్షం దంచికొడుతోంది. భారీ వర్షానికి నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read :- హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షానికి జీహెచ్ఎంసీ అలర్ట్

మరో వైపు  మరో మూడు రోజుల పాటు తెలంగాణలో   తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  బంగాళఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడతాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి,  వనపర్తి, జనగామ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  అక్కడక్కడా ఉరుములు,మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించింది.