నైపుణ్యం ఉన్నవారినే టీచింగ్ ప్రొఫెషన్‌ల్ లోకి తీసుకురావాలి

నైపుణ్యం ఉన్నవారినే  టీచింగ్ ప్రొఫెషన్‌ల్ లోకి తీసుకురావాలి

గురువులకు సరైన గుర్తింపు లభించినప్పుడే కష్టపడి పనిచేస్తారని అన్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. GP బిర్లా సెంటర్ లో స్ట్రీట్ కాస్ నిర్వహించిన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమానికి గోపీచంద్ హాజరయ్యారు. భారత్ లో స్పోర్ట్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెరగాల్సి ఉందన్నారు గోపీచంద్.. జీవితంలో ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలని.. ఆ గోల్ ఏమిటో కాలేజీ రోజుల్లోనే నిర్ణయించుకోవాలన్నారు. నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే టీచింగ్ ప్రొఫెషన్ లోకి తీసుకురావాలన్నారు. ఫిన్ లాండ్ లాంటి దేశాల్లో టీచర్లకి మంచి డిమాండ్ ఉండటంతో పాటు.. వారికి జీతం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు గోపీ చంద్.