క్రేజీ కాంబినేషన్.. బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్ మొదలైంది

క్రేజీ కాంబినేషన్.. బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్ మొదలైంది

క్రేజీయెస్ట్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత వీరిద్దరు చేస్తున్న మూడో సినిమా ఇది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా  షూటింగ్ సోమవారం ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. బాలయ్య పై తీసిన ఓ యాక్షన్ సీన్ తో షూటింగ్ ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ కి బోయపాటి దర్శకత్వం వహించారు.

ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ ఫుల్ గా మంచి కథా బలం తో పాటు చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఒక పాత్రలో ఆయన అఘోరాగా కనిపిస్తారని తెలుస్తోంది. జంటగా అంజలితోపాటు మరో కథానాయిక కూడా కనిపించనున్నారని సమాచారం.

ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్ మాస్టర్స్: రామ్ – లక్ష్మణ్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

balakrishna-and-boyapati-srinus-film-shoot-commences