నీట్ పేపర్ లీకేజీలో కేటీఆర్ బినామీ సంస్థ..ఆనాడే గ్లోబరీనాను బ్లాక్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెడితే నీట్ లీక్ అయ్యేది కాదు: బల్మూరి వెంకట్

నీట్ పేపర్ లీకేజీలో కేటీఆర్ బినామీ సంస్థ..ఆనాడే గ్లోబరీనాను బ్లాక్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెడితే నీట్ లీక్ అయ్యేది కాదు: బల్మూరి వెంకట్
  • కేంద్ర ప్రభుత్వ పతనానికి నీట్​లీకేజీ నాంది: అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, వెలుగు:  నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. నీట్ లీకేజీలో కేటీఆర్ బినామీ సంస్థ అయిన ‘కోఎంప్ట్’ ఉందన్న ఆయన.. ఇది పేరు మార్చుకున్న 'గ్లోబరీనా' కంపెనీయేనని ఆరోపించారు. గురువారం సీఎల్పీలో మరో విప్ అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణలో 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలితీసుకున్న గ్లోబరీనా సంస్థను ఆనాడే బ్లాక్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెట్టి ఉంటే..

ఇప్పుడు దేశంలో నీట్ పేపర్ లీకయ్యేది కాదని, ఇంతమంది విద్యార్థులు చనిపోయేవారు కాదని వెంకట్ వ్యాఖ్యానించారు. గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకోగా.. కేటీఆర్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తోనే కేంద్రంలో ఆ కంపెనీకి టెండర్లు ఇప్పించారని ఆరోపించారు. అంతేకాకుండా, గ్లోబరీనా రాజుకు చెందిన భూములను, బిల్డింగులను కూడా కేటీఆర్ వాడుకుంటున్నారని విమర్శించారు.

పోలీసుల ముసుగులో అరాచక శక్తుల దాడులు: అద్దంకి దయాకర్ 

నీట్ పేపర్ లీకేజీ ఘటన, ఆ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వ పతనానికి నాంది అని  విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌పై, చివరికి ఆడపిల్లలు అని కూడా చూడకుండా పోలీసుల ముసుగులో ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ అరాచక శక్తులు దాడులు చేస్తున్నాయని ఫైర్​ అయ్యారు.