సైఫాబాద్, వెలుగు : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ టి.మధుసూదన్ అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన రోహిత్ ముదిరాజ్ సోమవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు కు ఫిర్యాదు సమర్పించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలించి, కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు. అలాగే డిజిటల్ ఆధారాలను భద్రపరిచి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి, చట్ట ప్రకారం మధుసూదన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
