కేసీఆర్ నిరుద్యోగ ద్రోహి: బల్మూరి వెంకట్

కేసీఆర్ నిరుద్యోగ ద్రోహి: బల్మూరి వెంకట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నిరుద్యోగ ద్రోహి అని, తొమ్మిదేండ్లుగా నిరుద్యోగులను ఆయన మోసం చేస్తున్నారని ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ కార్యకర్తలు, కాంగ్రెస్ ఫిషర్మెన్ కమిటీ నాయకులు శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడారు. గ్రూప్‌‌‌‌ 2 పరీక్ష వెంటనే వాయిదా వేయాలన్నారు. పరీక్షలన్నీ ఒకేసారి పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చివరి అసెంబ్లీ సమావేశాలు అయినప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. స్టూడెంట్లకు స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్ ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన హెల్త్ సిబ్బంది

తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారంతా అసెంబ్లీకి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు హెల్త్ సిబ్బందిని అడ్డుకున్నారు. అందరిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. దవాఖాన్లు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌‌‌‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని అసోసియేషన్లు డిమాండ్ చేశాయి.