‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మించారు. మార్చి 26న సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిరంజీవి లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూస్తుంటే ఫన్ ఓరియంటెడ్, యూత్ లవింగ్ సినిమాలా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ జంట డ్యాన్స్లు చూశాను. కోన వెంకట్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నా. దర్శకుడి డైలాగ్ పంచ్‌లు బాగున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.
ఇక ట్రైలర్‌ను చూస్తే.. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావమరదలుగా రోషన్, శ్రీదేవి కనిపించారు. వీళ్లిద్దరి అల్లరితో సరదాగా మొదలైన ప్రేమకథలో.. చిన్నపాటి అపార్థాలు దూరం పెంచాయనే పాయింట్‌తో ఎండ్ చేశారు. ‘నేను నిన్ను మస్త్ లవ్ చేశిన.. కానీ నువ్వు నన్ను దేఖలే.. నువ్వు వచ్చిన తర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకుపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్...’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. మరదలు రాజి ప్రేమను గెలుచుకునేందుకు గిరి ఏం చేశాడు అనేది మిగతా కథ. రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీ, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేశాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
