పోక్సో కేసులో బండి భగీరథ్‎కు 3 రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో బండి భగీరథ్‎కు 3 రోజుల పోలీస్ కస్టడీ

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బండి భగీరథ్‎ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భగీరథ్‎ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు అనుమతించింది. ఈ మేరకు మూడు రోజుల పాటు భగీరథ్‎ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు మంగళవారం (మే 26) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసుల భగీరథ్‎ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. 

 కాగా, మైనర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై బండి భగీరథ్‎పై పేట్ బషీర్‎బాద్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా భగీరథ్ జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో  సంచలనం సృష్టించిన ఈ హై ప్రొఫైల్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడుని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం భగీరథ్‎ను మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది.