600 కోట్ల ఆస్తులుంటే..నిరుద్యోగ భృతి నేనే ఇస్తా

600 కోట్ల ఆస్తులుంటే..నిరుద్యోగ భృతి నేనే ఇస్తా

హైదరాబాద్‌‌, వెలుగు: తానూ 600 కోట్లు  సంపాదించినట్టుగా సోషల్ మీడియా లో ఫాల్త్ గాళ్లు ప్రచారం చేస్తున్నారన్నారు బండి సంయ్.తాను 600 కోట్లు సంపాదించినట్టు నిరూపిస్తే నిరుద్యోగ భృతి తానే ఇస్తానన్నారు.  వెలుగు న్యూస్‌‌ పేపర్‌‌‌‌ పేరిట బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై సోషల్‌‌ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ కావడంపై బీజేపీ ఐటీ సెల్‌‌ కన్వీనర్ వెంకటరమణ బుధవారం సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.  సంజయ్​కు రూ.600 కోట్ల ప్రాపర్టీ ఉన్నట్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాయిస్‌‌ ఆఫ్ తెలంగాణ, స్పిరిట్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ, పొన్నం ప్రభాకర్ యువసేన పేరుతో ఫేస్‌‌బుక్ పేజీల్లో.. సంజయ్ కి వ్యతిరేకంగా వెలుగు పేపర్ లో ఆర్టికల్స్ పబ్లిష్ అయినట్లుగా ఫేక్ పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పలు సెక్షన్ల కింద ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి, ఐపీ అడ్రెస్​ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.