వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మా పరిధిలోకి రాదు

వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మా పరిధిలోకి రాదు
  • హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించడం తమ పరిధిలోకి రాదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగింపు అనేది బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఉంటుందని చెప్పారు. ఈ నెల 20న ప్రారంభంకానున్న హజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాత్ర నేపథ్యంలో నాంపల్లి హజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ కార్యక్రమం తర్వాత పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు విషయంపై మీడియాతో మాట్లాడారు. మైనర్ కేసులో తన మనువడు ఉన్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బాలికపై జరిగిన అఘాయిత్యం కేసును పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. అందులో నిజం తేలిందని పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఇతర పార్టీల నేతల బంధువులపై నమోదైన కేసు వేరు, రాజకీయాలు వేరని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు దేశంలోనే మంచి 
పేరుందని అన్నారు.