హైదరాబాద్ సిటీ, వెలుగు: కొన్ని నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన అంకం రాహుల్ మృతికి కారణమైన నిందితులను గుర్తించి శిక్షించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ సీపీ సజ్జనార్‌ను కోరారు. శుక్రవారం కమిషనర్‌ను కలిసి రాహుల్ అనుమానాస్పద మృతికి సంబంధించిన పలు కీలక అంశాలు, కేసు పూర్వాపరాలు, ఇప్పటివరకు జరిగిన పరిణామాలను వివరించారు.
బీసీ రాజ్యాధికార సమితి సీఈవో పోశాల సరస్వతి, సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్‌చార్జి మంద వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మంద ఈశ్వర్ పాల్గొన్నారు.
