ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ (ఐపీఎల్‌జీసీ) ఇండియాలో సుప్రసిద్ధ, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ బ్రోకరేజీ సంస్ధ అప్‌స్టాక్స్ ను ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ ఛైర్మన్ శ్రీ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2021కు అధికారిక భాగస్వామిగా అప్‌స్టాక్స్ మా బోర్డ్‌పై రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో ఎక్కువ మంది వీక్షించే క్రికెట్‌లీగ్‌గా ఐపీఎల్ నిలిస్తే, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వాణిజ్య వేదికగా అప్‌స్టాక్స్ నిలుస్తుంది. ఈ ఇరు సంస్థల కలయిక ప్రేక్షకులపై భారీ ప్రభావం సృష్టించనుంది. మరీ ముఖ్యంగా తమ ఆర్థిక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించేందుకు మరిన్ని అవకాశాల కోసం వెతుకుతున్న యువతపై ఇది ప్రభావం చూపనుంది’’ అని అన్నారు.
అప్‌స్టాక్స్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీ రవికుమార్ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2021కోసం బీసీసీఐతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. క్రికెట్ కేవలం ఓ క్రీడ మాత్రమే కాదు, మన సంస్కృతి, సామాజిక జీవితంలో కూడా అత్యంత కీలకం. భారతదేశపు ఆర్ధిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన అప్‌స్టాక్స్ లాగానే భారత క్రికెట్‌లో నూతన మార్గాన్ని ఐపీఎల్ వేసింది. క్రీడలతో ఇప్పుడు ఆర్ధికాన్ని కలుపడం ద్వారా దేశంలో ఆర్ధిక అవగాహనను విస్తరించనున్నాం’’ అని అన్నారు. స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్ రంగంలోని ఓ బ్రాండ్ , ఈ రంగాల పట్ల అవగాహన కల్పించడానికి ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ భాగస్వామ్యం చేసుకుంది.

