డ్రగ్స్‌‌ ఫ్రీ ఇండియా శునకం యాత్ర

డ్రగ్స్‌‌ ఫ్రీ ఇండియా శునకం యాత్ర

డ్రగ్స్‌‌కు వ్యతిరేకంగా దేశంలో చాలారకాల క్యాంపెయిన్లు  జరుగుతుంటాయి. కానీ వాటన్నింటిలో ‘గ్లోబల్ సంచారి’ క్యాంపెయిన్ మాత్రం కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఈ క్యాంపెయిన్ చేయబోయేది ఒక కుక్క. కేరళకు చెందిన ‘కర్నల్ బెల్లా’ అనే కుక్క డ్రగ్స్‌‌ ఫ్రీ ఇండియా కోసం ఏకంగా 20వేల కిలోమీటర్లు తిరగనుంది.

డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు కేరళకు చెందిన ఒక టీం ‘గ్లోబల్‌‌ సంచారి’ పేరుతో ఇండియా అంతా క్యాంపెయిన్ టూర్ చేస్తోంది. ఈ గ్రూప్‌‌ టూర్‌‌లో కర్నల్ బెల్లా అనే ఓ నాలుగేండ్ల ట్రెయిన్డ్​ డాగ్‌‌ కూడా పాల్గొంటోంది. ఈ కుక్క డ్రగ్స్‌‌ వ్యతిరేక స్లోగన్స్​ రాసిన జాకెట్లు వేసుకుని దేశమంతా తిరుగుతోంది. కేరళలోని కలమస్సేరి పోలీస్ స్టేషన్‌‌లో  పనిచేస్తున్న రఘు.. బెల్లాను పెంచుకుంటున్నాడు. బెల్లా.. అన్నిరకాల ప్రొఫెషనల్ ట్రైనింగ్‌‌లు తీసుకుని టూర్‌‌‌‌కు రెడీ అయిందని చెప్పాడు ఆయన. 

ఈ యాత్ర గురువారం మొదలైంది. 26 రాష్ట్రాల్లో 20 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ టీం తిరిగి వస్తుంది.  ఈ టూర్‌‌‌‌కి సంబంధించిన విషయాలు, అప్‌‌డేట్స్‌‌.. ‘గ్లోబల్‌‌ సంచారి’ పేరుతో ఉన్న యూట్యూబ్, ఫేస్‌‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ పేజీల్లో అప్‌‌లోడ్ చేస్తారు.