ఆరోగ్య రంగం రాష్ట్రాల చేతిలో ఉంటే మెరుగైన సేవలు: కేటీఆర్

ఆరోగ్య రంగం రాష్ట్రాల చేతిలో ఉంటే మెరుగైన సేవలు: కేటీఆర్

హెల్త్ కేర్ రంగంలో మెడిసిన్, ట్రీట్మెంట్, పరికరాలు ధరలు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్మారంగంలో భారత్ వృద్ధి బాగుందన్నారు. హైదరాబాద్ HICC లో బయోఏషియా- 2019 సదస్సులో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంతో కలిసి పాల్గొన్నారు కేటీఆర్. వైద్యరంగంలో కొన్ని పక్కన ఉన్న దేశాలకంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. మిగతా దేశాలకంటే భారత్ లో ప్రజలు హెల్త్ కేర్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు. హెల్త్ కేర్ రంగాన్ని రూపొందించడంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆరోగ్య రంగం పూర్తిగా రాష్ట్రాల చేతిలో ఉంటే.. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం బాగుందన్నారు.