పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కలెక్టరేట్ సమీపంలో నిర్మిస్తున్న ఎస్పీ ఆఫీస్, ఎస్పీ క్యాంపు కార్యాలయ నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. సోమవారం నిర్మాణంలో ఉన్న భవనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెక్యూరిటీ, పరిపాలన విభాగం గదులతో పాటు సిబ్బంది విభాగాలను పరిశీలించిన ఆయన ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.
